Khamenei Funeral: ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నే కారణమని ఆరోపిస్తూ ఇరాన్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న లక్షలాది ప్రజలు నల్లని దుస్తుల్లో పిడికిలి బిగించి "ట్రంప్‌ను చంపేయాలి" అంటూ నినాదాలు చేశారు. ట్రంప్‌ దిష్టిబొమ్మలను ప్రదర్శిస్తూ, అతని అంతం కావాలని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లు, నినాద ఫలకాలు చేతపట్టుకొని టెహ్రాన్‌ వీధులను కిక్కిరిసిపోయేలా ఊరేగింపు నిర్వహించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును కూడా చంపేయాలని కొందరు నినాదాలు చేశారు.

ఇరాన్‌ ప్రభుత్వ టీవీలో ఈ ఊరేగింపు దృశ్యాలను ప్రసారం చేశారు. ఖమేనీ పార్థివదేహం మరియు ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను ఒకే వాహనంలో ఉంచి ప్రజల సందర్శనకు అనుమతించారు. 2020లో రివల్యూషనరీ గార్డ్‌ జనరల్‌ ఖాసెం సొలెమని అంత్యక్రియల్లో దాదాపు 10 లక్షల మంది పాల్గొన్న రికార్డును ఈసారి మించినట్లు కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి ఖమేనీకి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఇరాన్‌ దౌత్య కార్యాలయం భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ చూపుతున్న మిత్రభావం, సహానుభూతి మరియు హృదయపూర్వక గౌరవాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొంది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story