భారత్‌, చైనా, బ్రిజిల్‌ దేశాలకు నాటో చీఫ్‌ హెచ్చరిక

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై వంద శాతం ఆంక్షలు విధిస్తామని నాటో (నార్త్ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే హెచ్చరించారు. రష్యాతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న భారత్‌, బ్రెజిల్‌, చైనా దేశాల నేతలను నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టే తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే రష్యాతో వ్యాపార సంబంధాలు నిలిపివేసి ఆ దేశం శాంతి చర్చలకు వచ్చేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై ఒత్తిడి తీసుకు రావాలని ఈ మూడు దేశాల నేతలకు రుట్టే సలహా ఇచ్చారు. ఉక్రెయిన్ తో యుద్దం ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఆదేశాన్ని ఒంటరి చేయాలని అమెరికా చాలా కాలంగా వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలోనే నాటో ద్వారా ఇండియా, చైనా, బ్రిజిల్‌ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా నాటో సెక్రటరీ జనరల్‌ తో ఈ ప్రకటన చేయించిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్‌ అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో భారత్‌ ముందు వరుసలో ఉంది. దీన్ని అసరాగా తీసుకుని ఆంక్షలు విధిస్తే భారత్‌ పై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇదే విషయంపై మాట్లాడారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠినమైన సుంకాలను విధిస్తామని ట్రంప్‌ చేసిన హెచ్చరికలను అనురసరిస్తే అవే హెచ్చరికలు తాజాగా నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టే చేశారు. నాటో చీఫ్‌ మార్క్‌ రుట్టే స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు ఫోన్‌ చేసి శాంతి చర్చల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story