డాలర్‌ ఆధిపత్యాన్ని చేజార్చుకునే ప్రశక్తే లేదన్న ట్రంప్

త్వరలోనే బ్రిక్స్‌ యూనియన్‌ కనుమరుగువుతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జోస్యం చెప్పారు. డాలర్‌ ఆధిపత్యాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్‌ అనే చిన్న సమూహం కనుమరుగు కానుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఏ దేశానికైనా ఇటువంటి దెబ్బే తగులుతుందని ట్రంప్‌ హెచ్చరించారు. తాము తీసుకువచ్చిన జీనియస్‌ చట్టం అమెరికా డాలర్‌ ని బలోపేతం చేస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా డాలర్‌ కు అత్యధిక ప్రాధాన్యత తీసుకు వస్తుందని ట్రంప్‌ చెపుతున్నారు. అయితే బ్రిక్స్‌ దేశాలు దేశాలు డాలర్‌ ను అధిగమించాలని ప్రయత్నిస్తే అంతరించిపోతారని అన్నారు. బ్రిక్స్‌ యూనియన్‌ లో ఉన్న దేశాలపై పది శాతం అదనపు సుంకం విధిస్తామని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నమని ట్రంప్‌ స్పష్టం చేస్తున్నారు. తాను బ్రిక్స్‌ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తామని ప్రకటన చేసిన తరువాతి రోజే బ్రిక్స్‌ సమావేశం నిర్వహించారని వ్యాఖ్యానించారు. ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా ఉన్న డాలర్‌ హోదాను ఎన్నటికీ అమెరికా చేజార్చుకోదని ట్రంప్‌ స్పష్టం చేశారు. బ్రిక్స్‌ దేశాలు తమ తీరును మార్చుకోవాలని ట్రంప్‌ హితవు పలికారు. నిన్న శుక్రవారం 18వ తేదీన తాను సంతకం చేసిన జీనియస్‌ చట్టం ప్రపంచ డిజిటల్‌ కరెన్సీ విధానంలో కొత్త అధ్యాయమని ట్రంప్‌ పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story