ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ: తైవాన్‌ అంశంపై కీలక వార్నింగ్‌

Warns Xi Jinping: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదేళ్ల తర్వాత చైనా సందర్శనకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తైవాన్‌ సమస్యపై జిన్‌పింగ్‌ అమెరికాకు కీలక హెచ్చరికలు చేశారు. ఇరు దేశాల సంబంధాల్లో తైవాన్‌ అత్యంత సున్నితమైన, కీలక అంశమని స్పష్టం చేశారు.

తైవాన్‌ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే అమెరికా-చైనా మధ్య ఘర్షణ రావడం ఖాయమని జిన్‌పింగ్‌ హెచ్చరించారు. తైవాన్‌ జలసంధిలో శాంతి, స్థిరత్వం కాపాడటం ఇరు దేశాల మధ్య అతిపెద్ద సవాలని అన్నారు. ప్రపంచం ఆసక్తిగా ఈ సమావేశాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అమెరికా-చైనా భాగస్వామ్య దేశాలుగా ఉండాలని, ప్రత్యర్థులుగా కాదని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మేలు చేస్తాయని అన్నారు. విభేదాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువని తన నమ్మకం వ్యక్తం చేశారు.

ట్రంప్‌-జిన్‌పింగ్‌ మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. తైవాన్‌తోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం, ఇతర ముఖ్య అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం వివరాలను చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

భేటీకి ముందు ట్రంప్‌ మాట్లాడుతూ జిన్‌పింగ్‌తో తన సమావేశాన్ని ‘అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం’గా అభివర్ణించారు. చైనా అధ్యక్షుడితో తనకున్న వ్యక్తిగత స్నేహం గర్వకారణమని చెప్పారు. జిన్‌పింగ్‌ గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story