2.2 లక్షల జారీపై తీవ్ర విమర్శలు!

Chennai H-1B Visa Scam: అమెరికాలో హై-స్కిల్డ్ వర్కర్లకు అందించే ఎచ్-1బి వీసా వ్యవస్థలో భారతదేశం అధిక ఆధిపత్యం చెలాయిస్తోందని మాజీ అమెరికా ప్రతినిధి, ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 85 వేల ఎచ్-1బి వీసాలు మాత్రమే ఆమోదించినప్పటికీ, భారతదేశంలోని చెన్నై అమెరికన్ కాన్సులేట్ ద్వారా 2.2 లక్షల వీసాలు జారీ అవ్వడం అన్యాయమని, ఇది నిర్దిష్ట పరిమితికి రెండింతలకు పైగా ఎక్కువగా ఉందని బ్రాట్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికన్ రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తూ, భారతీయ ఐటీ కార్మికుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి.

2024లో చెన్నై కాన్సులేట్ ద్వారా 2.2 లక్షల ఎచ్-1బి వీసాలతో పాటు 1.4 లక్షల ఎచ్-4 (భార్యాభర్తలు, పిల్లలకు) వీసాలు ప్రాసెస్ చేయబడినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. భారతీయులు ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని, మోసాల ద్వారా అమెరికన్ ఉద్యోగాలు, కుటుంబాల భవిష్యత్తును దోచుకుంటున్నారని బ్రాట్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వంటి దేశాల వాటా మొత్తం ఎచ్-1బి వీసాల్లో కేవలం 12 శాతమే ఉండగా, భారత్ 70-80 శాతాన్ని పొందుతోందని, ఇది వ్యవస్థలోని లోపాలకు స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు. ఈ కొత్త వ్యాఖ్యలు అమెరికాలో ఎచ్-1బి వీసా సంస్కరణలపై జరుగుతున్న చర్చలకు తొడక్కెక్కించాయి.

చెన్నై కాన్సులేట్‌పై దృష్టి మళ్లడానికి మరో కారణ గతంలో జరిగిన మోసాల ఆరోపణలు. మాజీ అమెరికా రాయబారి మహ్వాష్ సిద్దిఖీ, 2005-2007 మధ్య చెన్నైలో విధులు నిర్వహించినప్పుడు "ఇండస్ట్రియలైజ్డ్ ఫ్రాడ్" (వాణిజ్యపరమైన మోసాలు) ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే 80-90 శాతం ఎచ్-1బి వీసా అప్లికేషన్లు నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు డిగ్రీలు, నైపుణ్యం లేని అభ్యర్థులపై ఆధారపడి ఉన్నాయని ఆమె చెప్పారు. తాను పనిచేసిన కాలంలో 51 వేల అప్లికేషన్లను పరిశీలించానని, ముఖ్యంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో వీసా దరఖాస్తులకు శిక్షణ ఇచ్చే పేరుతో నకిలీ విద్యా సర్టిఫికెట్లు, వివాహ ధృవీకరణలు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలు భారతీయ ఐటీ రంగంలోని విదేశీ ఉద్యోగాలపై అమెరికాలోని ఒత్తిడిని మరింత పెంచాయి.

ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఎచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ సంస్కరణలు తీసుకుంటోంది. మోసాలను అరికట్టడం, అమెరికన్ కార్మికుల ఉద్యోగాలను కాపాడటం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డేవ్ బ్రాట్ వ్యాఖ్యలు భారత్‌పై పారదర్శకత, వీసా వ్యవహారాల్లో నీతి పాటింపుపై తాజా ప్రశ్నలు లేవనెత్తాయి. భారతీయ ఐటీ కంపెనీలు, విదేశీ పని వెతికే యువత మధ్య ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో వీసా విధానాల మార్పులు భారతీయుల అవకాశాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story