Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టారిఫ్‌ల విషయంలో మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన 10 శాతం సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 2-1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అధ్యక్షుడికి కాంగ్రెస్ కల్పించిన సుంకాల అధికార పరిధిని ట్రంప్ అతిక్రమించారని కోర్టు పేర్కొంది. ఫలితంగా ఆయన విధించిన ఈ సుంకాలు చెల్లవని తీర్పు వచ్చింది. అయితే, ఒక న్యాయమూర్తి ఈ తీర్పును వ్యతిరేకించారు.

ఇంతకు ముందు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కూడా ట్రంప్ టారిఫ్‌లను చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ 10 శాతం తాత్కాలిక గ్లోబల్ టారిఫ్‌లను విధించింది. ఈ సుంకాలు జూలై 24తో ముగియనున్నాయి.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 24 అమెరికా రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వాటి అర్జీపై విచారణ జరిపిన కోర్టు ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ట్రంప్ యంత్రాంగానికి మరోసారి సవాల్‌గా మారింది. ప్రపంచ వాణిజ్యంపై ట్రంప్ చేపట్టిన కఠిన విధానాలకు న్యాయస్థానాల నుంచి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story