Epstein Files: ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్‌ లైంగిక కుంభకోణం కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ మరిన్ని రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. ఈ ఫైళ్లలో అనేక ఆశ్చర్యకరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, 2018లో ఎఫ్‌బీఐ ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన అదే రోజున ఎప్‌స్టీన్‌ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని (సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌) కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. అతడి ఈమెయిల్‌ రసీదుల్లో 2018 జూన్‌ 12న లిటిల్‌ సెయింట్‌ జేమ్స్‌ ద్వీపంలో 55 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ ఆమ్లం డ్రమ్‌లు డెలివరీ అయినట్లు స్పష్టంగా నమోదైంది.

దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు సేకరించకుండా నిరోధించేందుకు ఎప్‌స్టీన్‌ ఈ ఆమ్లాన్ని కొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రసాయనంతో సాక్ష్యాలు లేదా మానవ అవశేషాలను నాశనం చేసే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, అతడి ద్వీపంలోని రివర్స్‌ ఓస్మోసిస్‌ (ఆర్వో) నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ ఆమ్లాన్ని ఉపయోగించేవాడని ఫైళ్లలోని వివరాలు తెలియజేస్తున్నాయి. కానీ, ఆర్వో ప్లాంట్‌కు మాత్రమే అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆమ్లం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ కొనుగోళ్ల వెనుక దాగిన నిజమేమిటనే ప్రశ్నలు మిగిలిపోతున్నాయి.

ఇటీవల బయటపడిన మరో వివరంలో, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ ఎప్‌స్టీన్‌ ద్వీపాన్ని సందర్శించినట్లు ఒప్పుకున్నారు. ఈ కేసు ఇంకా అనేక రహస్యాలను దాచిపెట్టి ఉందని స్పష్టమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story