పస లేని చైనా సరుకు, చూపు జర్మనీ వైపు

Pakistan:పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత్ క్షిపణుల ముందు వెలవెలబోయింది. దీంతో చైనా రక్షణ వ్యవస్థకు స్వస్తి చెప్పి అధునాతన రక్షణ వ్యవస్థ జర్మనీ నుంచి కొనుగోలు చేయాలని భావిస్తోంది.

పహల్గామ్ ఒక ఉగ్ర దాడితో తీవ్ర ఆవేదనకు గురైన ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారు. ప్రతి దాడికి దిగిన పాకిస్థాన్ ను గజగజ వణికించింది. ఆ దేశంలోని వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. భారత్ ప్రతాపాన్ని ఎదుర్కోలేక పాకిస్థాన్ బిక్కమొహం వేసింది. చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత్ అస్త్రాలను నిలువరించలేక పోయింది. దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి పలికి. జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని పాకిస్థాన్ అడుగులు వేస్తోంది.

చైనా రక్షణ వ్యవస్థ పై నమ్మకం లేక.

పాకిస్తాన్ ప్రస్తుతం చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్క్యూ-9 హెచ్క్యూ-16 గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఇటీవల భారత్ ప్రయోగించిన డ్రోన్ క్షిపణి దాడులను అవి నియంత్రించలేకపోయాయి. అంతే కాకుండా పాక్ చెబుతున్నట్లు, ఒకవేళ భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన వాటిని ఎదిరించే సత్తా ఈ రెండు రక్షణ వ్యవస్థలకు లేనట్లు తేలిపోయింది. ఈ నేపథ్యంలో కచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు పాక్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా రష్యా అలుపెరుగని యుద్ధం చేస్తున్న సమర్థంగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్ వినియోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు... జర్మనీని నుంచి కొనుగోలు చేసింది.

బ్రహ్మోస్ సృష్టించిన అలజడి.

ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ తమ వైమానిక స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీని బట్టి భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే తట్టుకోలేమని పాకిస్థాన్ ముందుగానే గ్రహించింది. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.

జర్మనీ వైపు పాక్ చూపులు..

గత ఏడాదిలో రష్యా ప్రయోగించిన 60 క్షిపణులను సమర్థంగా నేల కూల్చినట్లు నెల రోజుల క్రితం ఉక్రెయిన్ ప్రకటించింది. జర్మనీ నుంచి కొనుగోలు చేసిన ఆ ఐరిస్-టి-ఎస్ ఎల్ ఎం(IRIS-T-SLM)గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించినట్లు తెలిపింది. ఢీల్ డిఫెన్స్ సంస్థ తయారు చేసిన ఈ వ్యవస్థ.. రష్యాకు చెందిన P-800 ఆన్సిక్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొంది. ఈ క్షిపణులకు, భారత్ రూపొందిచిన బ్రహ్మోస్ క్షిపణులకు దగ్గరి పోలికలు ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వాటిని కొనుగోలు చేసేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఎందుకు ఈ రక్షణ వ్యవస్థ?

రక్షణ వ్యవస్థ అంటే భూ ఉపరితలం నుంచి క్షిపణి దాడులను ఎదుర్కొనే మధ్య శ్రేణి రక్షణ వ్యవస్థ. 1990 లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీల్ డిఫెన్స్ సంస్థ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ తర్వాతి కాలంలో పలు మార్లు అప్గ్రేడ్ చేసింది. రాడార్, ఆపరేషన్ సెంటర్లు, బహుళ లాంచర్ల వ్యవస్థ లాంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలను జోడించింది. 360 డిగ్రీల కోణంలో 40 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ వ్యవస్థ ఛేదించగలదు. 2023 లో జర్మనీ తన రక్షణ అవసరాల కోసం డీల్ డిఫెన్స్ సంస్థ నుంచి ఆరు ఐరిస్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. దీనికోసం సుమారు 971.73 మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది.

పాకిస్థాన్ కు అంత సులభమా?!

ఐరిస్-టి-ఎస్ ఎల్ ఎం కొనుగోలు కోసం ఢిల్లీ డిఫెన్స్ సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులువేం కాదు. ఆ సంస్థలో భాగస్వామ్యం ఉన్న థ్రైసెన్ క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ భారత్ లోని వివిధ రక్షణ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరిస్తుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, సుమారు ₹70,000 కోట్లతో భారత్ 6 జలాంతర్గాములను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు ఆ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ ఎటాక్ సిస్టమ్స్ సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా భారత్ కు చెందిన రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో డీల్ డిఫెన్స్ కు కీలక ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న భారత్ ను కాదని, పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

ఆర్థిక వనరులూ కొరతే!

పాకిస్థాన్ లో దాదాపు 45% మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. అంతే కాకుండా అభివృద్ధిని పక్కకు నెట్టి, రక్షణ కోసం నిధులు భారీగా ఖర్చు చేస్తున్నారని ఆ దేశంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్లు, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి మరో 800 మిలియన్ డాలర్లను పాక్ అప్పు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో పాక్ అంత భారీ మొత్తం చెల్లించి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, ఇప్పటివరకు మద్దతిస్తున్న చైనా కూడా పాక్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story