అమెరికాలో భారతీయుల ఆవేదన..పోస్ట్ వైరల్

Indians in US : అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఇటీవల జరిగిన తీవ్రమైన హింసాత్మక సంఘటనలు, నిరసనలు స్థానికంగా ఆందోళన కలిగించాయి. వలసదారులను నియంత్రించే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాల నుంచి వచ్చే వలసదారుల సమూహాలను ఒకే త్రాసులో పెట్టి చూసే ప్రయత్నం జరుగుతోంది. భారతీయ వలసదారులను కూడా హింసాపరులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఒక 'ఎక్స్' పోస్ట్ వైరల్ అయ్యింది. 'భారతీయ సమాజం అల్లర్లు చేయదు, కేవలం కష్టపడి పని చేస్తుంది' అని ఆ పోస్ట్ బలంగా వాదించింది.

'డోనాల్డో ట్రంపో అప్‌డేట్' అనే ఎక్స్ అకౌంట్ నుండి పోస్ట్ చేయబడిన మెసేజ్ లో.. "భారతీయలు అమెరికాకు కష్టపడి పని చేయడానికి వస్తారు తప్ప, అల్లర్లు చేయడానికి కాదు. కార్లను తగలబెట్టడం, దుకాణాలను దోచుకోవడం, నగరాలను నాశనం చేయడం వంటి పనులు ఏ భారతీయుడు చేయడు. పాలస్తీనా, సోమాలియా, పాకిస్తాన్, ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చిన కార్యకర్తలు, కొంతమంది మెక్సికన్లు హింస, అల్లర్లు, గొడవల్లో పాల్గొంటారు." ఈ పోస్ట్ 11 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. వెయ్యి మందికి పైగా దీనిపై రియాక్ట్ అయ్యారు. చాలా మంది ఈ పోస్ట్‌కు సపోర్ట్ ఇచ్చారు. భారతీయ సమాజం శ్రమజీవులనే అభిప్రాయానికి ఎక్కువ మంది ఏకీభవించారు.

ఒక నెటిజన్ ఈ పోస్టుకు ప్రతిస్పందిస్తూ.. "విదేశాల్లో ఉన్న చాలా మంది భారతీయలు కష్టపడి పని చేయడానికి, తమ కుటుంబాని అండగా నిలిచేందుకు, శాంతియుత జీవితాన్ని గడపడానికి ప్రిపరెన్స్ ఇస్తారు. ఇతరులకు ఇబ్బంది కలిగించరు. ఇతరుల వల్ల ఇబ్బందుల్లో చిక్కుకోకూడదు అనే విలువలతో తాము పెరిగాం" అని కామెంట్ చేశారు. ఇది భారతీయ సమాజం ప్రధాన విలువలను ప్రతిబింబిస్తుంది.

2023 గణాంకాల ప్రకారం, అమెరికాలో భారతీయ సమాజం సంఖ్య 52 లక్షలకు పైగా ఉంది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు. అమెరికాలో ఉన్న ఆసియా మూలాలున్న వారిలో చైనా తర్వాత భారతీయలే అత్యధికం. అమెరికా జనాభాలో కేవలం 1.5శాతం ఉన్నప్పటికీ, భారతీయలు అమెరికా ఆదాయపు పన్నులో 5-6శాతం చెల్లిస్తారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయల గణనీయమైన సహకారాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా అమెరికాలోని 60శాతం హోటళ్లను భారతీయలే నిర్వహిస్తున్నారు. అమెరికాలోని 16 ఫార్చ్యూన్-500 కంపెనీలకు భారతీయలే సీఈఓలుగా ఉన్నారు. విదేశాల నుండి అమెరికాకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులలో 25శాతం మంది భారతీయలే ఉన్నారు. ఈ గణాంకాలు, భారతీయలు కేవలం కష్టపడి పనిచేసేవారే కాకుండా అమెరికా ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story