ముగ్గురు మృతి, వీడియో వైరల్!

Horrific Chain Crash in Ontario: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ మత్తులో ట్రక్ నడుపుతూ నాలుగు వాహనాలను ఢీకొన్న భారతీయ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చైన్ రియాక్షన్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒంటారియోలోని 10-ప్రీవే హైవేపై ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అనే భారతీయుడు ట్రక్‌ను అతివేగంగా నడుపుతూ, బ్రేకులు వేయకుండా ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లాడు. మొదటి వాహనాన్ని ఢీకొన్న తర్వాత చైన్ రియాక్షన్‌గా మరో మూడు వాహనాలు తుక్కుతుక్కయిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు స్థానికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.

జషన్ ప్రీత్ సింగ్ కాలిఫోర్నియాలోని యూబా సిటీకి చెందినవాడు. 2022లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి, ఆ తర్వాత విడుదలైనట్లు అమెరికన్ మీడియా ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రమాదం తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. కెనడా పోలీసు అధికారి రోడ్రిగో జిమెనెజ్ మాట్లాడుతూ, "అతడు మాదకద్రవ్యాల మత్తులోనే ఈ ప్రమాదానికి పాల్పడ్డాడు. బ్రేకులు వేయకపోవడం వల్లే ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది" అని చెప్పారు.

మాదకద్రవ్యాల వినియోగం, పౌరుల హత్యలు వంటి అభియోగాలపై అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద చైన్ క్రాష్‌గా పోలీసులు అభివర్ణించారు. వీడియో గేమ్‌లలో చూసేలా ఉన్న ఈ ప్రమాద దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. రోడ్డు భద్రతపై మరిన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story