మూడు షరతులు పెట్టిన ఇరాన్

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌లతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ సానుకూల సంకేతం ఇచ్చింది. అయితే, శాంతి కోసం మూడు కీలక షరతులను పెట్టింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.

పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉందని, రష్యా, పాకిస్థాన్ నాయకులతో జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని పునరుద్ఘాటించానని ఆయన పేర్కొన్నారు. అమెరికా రగిల్చిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ పెట్టిన మూడు షరతులను అంగీకరించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఆ షరతులు ఇవే:

ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి.

జరిగిన నష్టాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలి.

భవిష్యత్తులో ఇలాంటి దురాక్రమణలు జరగకుండా పటిష్ఠమైన అంతర్జాతీయ హామీలు అందించాలి.

ఈ మూడు షరతులు నెరవేరిన తర్వాతే యుద్ధం ముగిసే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. ఈ పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యుద్ధం ముగిసే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు, కానీ షరతుల అంగీకారంపైనే అన్నీ ఆధారపడి ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story