ఇరాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్-గ్విర్ స్పష్టం చేశారు.

Israeli Minister: యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్-గ్విర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, ఇజ్రాయెల్ ఒక సార్వభౌమ దేశమని, అమెరికాకు సామంత రాజ్యం కాదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో గతంలో ఎదురైన గుణపాఠాల ఆధారంగా ఈ డీల్ విషయంలో స్పందిస్తున్నామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు.

‘ట్రంప్ ఒప్పందానికి మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మేము యూఎస్‌కు సామంత రాజ్యం కాదు. ఇజ్రాయెల్ ఒక సార్వభౌమ దేశం. అయితే, యూఎస్‌ఏ అంటే మాకెంతో గౌరవం, అధ్యక్షుడు ట్రంప్‌కు ఎంతో రుణపడి ఉన్నాము’ అని బెన్-గ్విర్ అన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇతర దేశాల ఒత్తిడికి లొంగిపోయి చివరకు రక్తంతో మూల్యం చెల్లించుకున్నామని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఓస్లో అకార్డ్స్, 2006 లెబనాన్ ఒప్పందం, గాజా పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆ అనుభవాల ఆధారంగానే యూఎస్-ఇరాన్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

తాజా శాంతి ఒప్పందం ప్రకారం అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణం పూర్తి స్టాప్ వేయాలని అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. లెబనాన్ సహా తమ మిత్రపక్షాలపై ఎలాంటి దాడులు జరగకూడదని ఇరాన్ షరతు విధించింది. అయితే డీల్ కుదిరే కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేయడంతో ఒప్పందం కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు కొన్ని గంటల ఆలస్యంగా డీల్ ఖరారైందని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story