త్వరలోనే అధికారిక ప్రకటన?

Kim Jong Un’s Daughter Likely to Get a High-Ranking Position: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏను వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రి సోల్ జూ లతో పాటు కిమ్ జూ ఏ కూడా పాల్గొనడం ఈ చర్చలకు కారణమైంది.

గురువారం నాడు తండ్రి-తల్లితో కలిసి కిమ్ జూ ఏ దేశ మాజీ నాయకులైన తన తాతముత్తాతల స్మారక స్థలాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఉత్తర కొరియా అధికార మాధ్యమాలు విడుదల చేసిన ఛాయాచిత్రాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో దేశ అధికార పగ్గాలు కిమ్ జూ ఏ చేతుల్లోకి అప్పగించే సంకేతాలుగా ఈ చిత్రాలను భావిస్తున్నారు.

జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో జరగనున్న పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో కిమ్ జూ ఏకు ముఖ్యమైన పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలు ఉత్తర కొరియాలో కుటుంబ ఆధిపత్య వారసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story