Leon Panetta: ఇరాన్‌పై అణ్వాయుధాల తయారీ ఆరోపణలతో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మూడు వారాలు దాటినా ముగింపు కనిపించడం లేదు. నాటో మిత్రదేశాలు పూర్తిగా మద్దతు ఇవ్వకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అమెరికా మాజీ రక్షణ మంత్రి, సీఐఏ మాజీ అధిపతి లియోన్ పనెట్టా తీవ్ర విమర్శలు చేశారు. యుద్ధం (Iran War) ఎంతకాలం కొనసాగితే అంతే క్లిష్టతలు ట్రంప్‌కు ఎదురవుతాయని ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

‘‘ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభానికి ట్రంప్ ఒక్కడే బాధ్యుడు. ఇరాన్‌పై యుద్ధానికి దిగితే ప్రపంచానికి ఎలాంటి ముప్పులు రావచ్చో అమెరికా యంత్రాంగానికి చాలా కాలంగా తెలుసు. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ బ్లాక్ చేసి ప్రపంచ ఇంధన రవాణాకు అంతరాయం కలిగిస్తుందన్న అంశంపై పూర్తి అవగాహన ఉంది. ఇది రాకెట్ సైన్స్ కాదు. కానీ తాజా ఘర్షణల్లో ట్రంప్ ఆ ప్రమాదాన్ని పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది’’ అని పనెట్టా విమర్శించారు.

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, హర్మూజ్ జలసంధి దాటే నౌకలకు భారీ టోల్ రుసుములు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ట్రంప్ పరిస్థితి మరింత దిగజారుతుందని పనెట్టా హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story