Mahmud Ahmadinejad: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్లో నాయకత్వ మార్పు కూడా ప్రధాన భాగం. అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదినెజాద్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అమెరికా-ఇజ్రాయెల్ రహస్యంగా ప్రయత్నించాయని అమెరికా మీడియా వెల్లడించింది. వెనెజువెలా తరహాలో ఇరాన్‌లో రెజిమ్ చేంజ్ తీసుకురావాలని ఆ రెండు దేశాలు యత్నించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ నాయకత్వంతో అహ్మదినెజాద్‌కు ఉన్న తీవ్ర విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికా-ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేశాయి. నెజాద్ ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యతిరేకతతో ప్రసిద్ధి చెందిన నాయకుడు. 2005 నుంచి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఖమేనీతో విభేదాల కారణంగా గృహ నిర్బంధానికి గురయ్యారు.

ఈ విభేదాలను తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని అమెరికా అహ్మదినెజాద్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. యుద్ధం మరికొన్ని రోజుల్లో మొదలవుతుందని సంకేతాలు వచ్చిన నేపథ్యంలో నెజాద్ హంగరీ, గ్వాటమాలా దేశాల్లో పర్యటించినట్లు వార్తలు వచ్చాయి. ఆ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం.

యుద్ధం ప్రారంభమైన రోజే నెజాద్‌ను విడిపించేందుకు అమెరికా-ఇజ్రాయెల్ ఆయన ఇంటిపై దాడి చేశాయి. అయితే ఆ తర్వాత నుంచి అహ్మదినెజాద్ బహిరంగంగా కనిపించలేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగి ఉంటే నెజాద్ అధికారంలోకి వచ్చే మంచి అవకాశాలు ఉండేవని ఇజ్రాయెల్ అధికార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ ప్రయత్నం పూర్తిగా వికటించిందని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story