Marco Rubio: భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఇప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ బలమైన భాగస్వామ్యానికి మూలకారణమని రూబియో అన్నారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల సహకారం మరింత విస్తరిస్తోందని ఆయన తెలిపారు.

భారత్, అమెరికా ప్రజల మధ్య ఉన్న స్నేహం ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని రూబియో స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం కేవలం రెండు దేశాల ప్రయోజనాలకే పరిమితం కాదని, అంతకు మించి విస్తరించి ఉందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దిల్లీతో పరస్పర సహకారానికి వాషింగ్టన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, భవిష్యత్తులోనూ భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా ఎదురుచూస్తోందని ఆయన అన్నారు.

ఇదే సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ భారత్‌కు, ప్రధాని మోదీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ ప్రభుత్వం కూడా భారత్‌తో తమ వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story