Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం మరోసారి ఉద్రిక్తతలోకి వచ్చింది. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన ఘటనకు నిరసనగా రాజధాని ఢాకాలో శుక్రవారం వేలాది మంది హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగడాలు, కొవ్వొత్తులతో మార్గాలను అల్లకల్లోలం చేస్తూ 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు.

ఈ నిరసనకు కారణం ఉత్తర గాయిబంద జిల్లాలోని శ్రీశ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ చేపట్టిన 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ స్థాపన కార్యక్రమం. అతివాదుల బెదిరింపుల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో, తాజాగా రాముడి చిత్రంపై చెప్పు ఉంచి అవమానించడం జరిగిందని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.

హిందూ మహాజ్యోత్ సంస్థ పిలుపు మేరకు షహబాగ్ కూడలి నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ప్రెస్ క్లబ్ ముందు మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు ఢాకా రిపోర్టర్స్ యూనిటీ భవనం వద్ద కూడా నిరసన తెలిపారు. రంగపూర్‌లో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

నిరసనకారులు ప్రభుత్వం మైనారిటీల సమస్యలపై మౌనం వహిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. రాముడి అవమానం చేసినవారిని 72 గంటల్లోగా అరెస్టు చేయాలని అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని హెచ్చరించారు.

ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి బయటపెట్టాయి. పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు అన్ని దృష్టులు పడుతున్న అంశం.

PolitEnt Media

PolitEnt Media

Next Story