హిందీ పాటలు నేర్చుకోవాలని ఉందని, అవకాశం దొరికితే బాలీవుడ్‌లో నటించాలని ఉందని మిస్‌ ఫిలిప్పీన్స్‌ కృష్ణా మేరీ గ్రావిడాస్ చెప్పింది. “బాలీవుడ్ సినిమాల గురించి తెలుసుకుంటున్నానని, కొన్ని క్లిప్స్ కూడా చూశానన్న కృష్ణా మేరీ.. ఏదైనా సినిమా చూడాలని సిఫార్సు చేస్తే చూడాలని ఉందని పేర్కొంది. తనకు సుల్తానా అనే పాట బాగా నచ్చిందని తెలిపింది. పొలిటెంట్‌ మీడియాకు ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో పలు అంశాలను షేర్‌ చేసుకుంది.


ఫిలిప్పీన్స్‌కి చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కృష్ణా మేరీ గ్రావిడాస్ ఈసారి తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చింది. “హలో అందరికీ! నా పేరు కృష్ణా మేరీ గ్రావిడాస్. నేను ఫిలిప్పీన్స్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు ‘కృష్ణా’ అని చెబితే భారతదేశంలో ఎంతో ఉత్సాహంగా స్పందిస్తారు. ఇది హిందూ దేవుడి పేరు అని తెలిసిన తర్వాత నాకు ఎంతో గర్వంగా అనిపించింది. అయితే నిజానికి అది మా స్థానిక భాష టగాలోలోని క్రిస్టో (యేసు క్రీస్తు) మరియు నోవా (నోవా ఆర్క్‌) అనే పదాల నుండి వచ్చింది. మా నాన్న ఈ రెండు పేర్లను కలిపి నా పేరు ‘కృష్ణా’గా పెట్టారు” అని ఆమె వివరించింది.



ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు ఎంతో కలర్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌ కల్చర్‌ను ఆస్వాదిస్తున్నానని, ఫిలిప్పీన్స్‌ కూడా పండుగల దేశం. భారత్‌ పండుగల తీరును అనుభవించడం ఎంతో ప్రత్యేకమని చెప్పింది.



తాను భవిష్యత్తులో సింగర్‌గా ఎదగాలనుకుంటున్నట్లు వెల్లడించిన కృష్ణా, ఇటీవలే ఒక రికార్డింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నానని, తన స్వంత పాటలను రూపొందిస్తున్నానని, ఈ ఏడాది పూర్తి ఆల్బమ్ విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నానని వివరించింది.



హైదరాబాద్‌ బిర్యానీ ఎంతగానో నచ్చిందని, మసాలాలతో కూడిన బిర్యానీ మధురానుభూతిని ఇస్తోందని చెబుతోంది. మేకప్, ఫోటోషూట్లు, ఇంటర్వ్యూలతో పాటు హైదరాబాదు చుట్టూ విహరించడం మర్చిపోలేనని, బుద్ధవనంలో సన్యాసులతో ధ్యానం చేయడం ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని చెప్పింది.



చార్మినార్‌లో షాపింగ్‌కి పూర్తిగా సమయం దొరకకపోయినప్పటికీ, సారీస్, చుడీలు ఎంత అందంగా ఉంటాయో చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపింది. ఫిలిప్పీన్స్‌కు తిరిగి వెళ్లేటప్పుడు సారీస్ తీసుకెళ్లాలనిపిస్తోందని చెప్పింది.




Politent News Web4

Politent News Web4

Next Story