తనకు, తన తల్లికి బాలీవుడ్‌ సినిమాలంటే చాలా ఇష్టమని మిస్‌ మెక్సికో మార్లీ లియాల్‌ చెప్పింది. భారతీయ సినిమాలంటే తనకు చాలా ఆసక్తి ఉందన్నారు. మిస్ వరల్డ్ 1994 ఐశ్వర్యా రాయ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె నటించిన బాలీవుడ్ సినిమా “ప్రైడ్ అండ్ ప్రెజుడీస్” తాను ఎంతో ఆస్వాదించానని తెలిపారు. తన తల్లి కూడా బాలీవుడ్ సినిమాలను, ముఖ్యంగా డ్యాన్స్‌లను బాగా ఇష్టపడుతుంటారని చెప్పింది.



మెక్సికోకు చెందిన మారి లియాల్ మిస్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనేందుకు భారతదేశానికి తొలిసారి వచ్చింది. తన హైదరాబాద్‌ పర్యటన ఎంతో అద్భుతమైన అనుభవంగా మారిందని చెప్పింది. ఇక్కడి సంస్కృతి, ప్రజలు, వాతావరణం అన్నింటినీ ఆస్వాదిస్తున్నానని చెప్పిన మారి, పలు ప్రముఖ ప్రదేశాలను సందర్శించామని వెల్లడించింది.



భారత సాంప్రదాయ వస్త్రధారణలో భాగంగా తొలిసారి చీర ధరించే అవకాశం లభించిందని, ఇది తనకు గర్వకారణంగా అనిపించిందని తెలిపింది. సారీల రంగులు, ఫ్యాబ్రిక్‌లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని మారి చెప్పింది. తెలుగు లేదా హిందీ భాషలో కొన్ని పదాలు కూడా నేర్చుకున్నానని, “నమస్కారం”.. అలాగే “బోన్నారూ” వంటి మాటలు మాట్లాడగలిగానని తెలిపింది. ఈ పేజెంట్ భారత్‌లో జరుగుతుందన్న విషయం తెలిసిన వెంటనే గూగుల్‌లో హైదరాబాద్ గురించి వెతికి, ఫోటోలు, ఇన్ఫర్మేషన్‌, కల్చర్‌ గురించి తెలుసుకున్నానని చెప్పింది.




Politent News Web4

Politent News Web4

Next Story