Marco Rubio Turns ‘Marco Lu’: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం చైనా పర్యటనలో ఉండగా, ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన పేరును **‘మార్కో లూ’ (Marco Lu)**గా మార్చుకుని చైనాలో అడుగుపెట్టారు.

ఈ పేరు మార్పుకు ప్రధాన కారణం రూబియోపై చైనా విధించిన ప్రవేశ నిషేధం. సెనేటర్‌గా ఉన్నప్పుడు రూబియో చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. ముఖ్యంగా ఉయిఘర్ (వీగర్) ముస్లింలపై జరుగుతున్న జాతి నిర్మూలన, బలవంతపు శ్రమ శిబిరాలు, లైంగిక హింస వంటి అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. చైనీయులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2020 నుంచి రూబియోకు చైనాలో ప్రవేశం నిషేధించబడింది.

అయితే, ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి అయిన తర్వాత దౌత్యపరమైన మార్గాలను అనుసరించి ఈ పర్యటన సాధ్యమైంది. పేరులోని ‘రూబియో’ స్థానంలో చైనీయులు సాధారణంగా ఉపయోగించే ‘లూ’ అనే పదాన్ని చేర్చి ‘మార్కో లూ’గా మార్చుకోవడం ద్వారా స్థానికంగా సాఫీగా ప్రవేశించడానికి ఈ వ్యూహం అనుసరించినట్లు తెలుస్తోంది.

ట్రంప్-షీ భేటీ

బుధవారం మధ్యాహ్నం చైనాకు చేరుకున్న ట్రంప్ గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీ జరిపారు. తైవాన్ సమస్య, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ నుంచి చైనా చేసే ముడి చమురు దిగుమతులు వంటి అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ప్రపంచం ప్రస్తుతం ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పర్యటనపై ఆసక్తి కేంద్రీకృతమై ఉంది.

ఈ పేరు మార్పు ఘటన దౌత్య రంగంలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story