ప్రధాని ఓలీ రాజీనామా..!

Nepal Under Military Control: నేపాల్‌లో రాజకీయ అస్థిరతలు తీవ్రమవుతున్న వేళ, సోషల్‌ మీడియా నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో దేశ రాజకీయ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

రాజీనామాకు ముందు ఓలీ, నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌తో చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దేశంలోని ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి, తన నివాసం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లేందుకు సైన్యం సహాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్మీ చీఫ్‌ ఓలీకి రాజీనామా సూచించారని, ఆ తర్వాతే సైన్యం పరిస్థితిని స్థిరీకరిస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంలోనే ఓలీ రాజీనామా ప్రకటించారు.

ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీల తరలింపు

దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతుండటంతో త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయంలో 300 మంది సైనికులను మోహరించారు. మంత్రులను వారి నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీలను సురక్షితంగా చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story