ఐఎస్‌ఎస్‌ నుంచి తిరుగు ప్రయాణమైన అస్ట్రోనాట్‌ శుభాంసు శుక్లా

ఇండియన్‌ ఆస్ట్రోనాట్‌ శుభాంశు శుక్లా తన 18 రోజుల అంతరీక్ష యాత్ర ముగించుకుని భూమి మీదకు తిరిగి రానున్నారు. ఏక్స్‌4 మిషన్‌ లో భాగంగా జూన్‌ 26వ తేదీన శుభాంసు శుక్లా నలుగురు వ్యామోగాములతో కలసి అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇంటర్‌ నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌ కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సాబోజ్‌ ఉజ్‌నాన్‌స్కీ విస్నీవ్‌స్కీ, టిబోర్‌ కపు, పెగ్గీ విల్సన్లు అంతరీక్షంలోకి వెళ్లారు. యాక్సియోమ్‌ మిషన్‌ 4ఏఎక్స్‌ చివరి దశకు రావడంతో ఐఎస్‌ఎస్‌ లో ఆదివారం ఈ నలుగురు వ్యామోగాములకు సెండాఫ్‌ ఇచ్చారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో శుభాంసు శుక్లా మాట్లాడుతూ తనకు ఈ అనుభవం మర్చిపోలేనిదని అన్నారు. ఐఎస్‌ఎస్‌ ప్రయాణం తనకు నమ్మశక్యం కానీ అద్భతమని చెప్పారు. ఐఎస్‌ఎస్‌లో అంతరీక్ష ప్రయోగాల్లో ఈ రోజుతో నా అధ్యాయం ముగిసిందని, కానీ భారత అంతరీక్ష సంస్ధ ప్రయాణం ప్రారంభమయ్యిందని అన్నారు. అంతరీక్షం నుంచి చూస్తే నాదేశం సంపూర్ణ విశ్వాసంతో కనిపిస్తోందన్నారు. సారే జహాసె అచ్ఛా అని నినదించారు. అంతరీక్ష పరిశోధనల్లో భవిష్యత్తులో భారత్‌ ఎన్నో విజయాలు సాధించడం కోసం అదరం ఐక్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. మిషన్‌ 4 ఏఎక్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి ఈ మిషన్‌ లో నేను భాగస్వామిని కవాడానికి సహకరించిన వారందరికీ శుభాంసు శుక్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాల అండగా నిలిచిన ఇస్రో, నాసా శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పారు.

Updated On 14 July 2025 11:26 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story