U.S. Visa Interview: అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం దీర్ఘకాల నిరీక్షణను తగ్గించేలా ట్రంప్‌ పాలన కొత్త 'ప్రీమియం సర్వీసు' పైలట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద 750 డాలర్ల అదనపు రుసుము చెల్లించిన వారికి బిజినెస్‌, టూరిస్ట్‌ వీసా ఇంటర్వ్యూను 10 రోజుల్లోపే ఎంపిక చేసిన ఎంబసీలు, దౌత్య కార్యాలయాల్లో షెడ్యూల్ చేసి ఇవ్వనున్నారు.

అమెరికా విదేశాంగ శాఖ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన నోటీసు ప్రకారం, ప్రస్తుతం బిజినెస్‌, టూరిస్ట్ వీసాలకు 185 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా 750 డాలర్లు చెల్లించిన వారికి వేగవంతమైన ఇంటర్వ్యూ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఈ పైలట్‌ ప్రోగ్రామ్ జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని నోటీసులో తెలిపారు. ఏ ఎంబసీలు, దౌత్య కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందనే వివరాలను జులై 1 ముందు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాన్ని మరింత కాలం పొడిగించవచ్చు.

ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది. కొన్ని దేశాల్లో ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు కొంత ఊరట కల్పించేందుకు ఈ ప్రీమియం సర్వీసు తీసుకురాబోతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story