Hanuman Statue: టెక్సాస్ హనుమాన్ విగ్రహంపై రాజకీయ దుమారం – సెనేటర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
సెనేటర్ వ్యాఖ్యలు చర్చనీయాంశం

Hanuman Statue: హిందువుల ఆరాధ్య దైవం హనుమాన్‌పై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నాయకుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవుడి విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టిన ఈ నాయకుడు, హనుమంతుడిని 'కల్పిత హిందూ దేవుడు'గా పేర్కొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్, ప్రస్తుతం టెక్సాస్ సెనేటర్‌గా పనిచేస్తున్నాడు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహ ఏర్పాటును తప్పుబట్టుతూ, శనివారం ఎక్స్ వేదికపై ఓ పోస్ట్ పెట్టాడు. 'టెక్సాస్ నగరంలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పిత విగ్రహాన్ని ఎలా అనుమతించారు? మనది క్రిస్టియన్ దేశం' అని ఆయన పేర్కొన్నాడు. మరో పోస్టులో బైబిల్‌లోని మాటలు ఉటంకిస్తూ, 'నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు' అని వ్రాశాడు.
డంకన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. యాంటీ-హిందూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది మత వివక్షకు దారి తీస్తుందని మండిపడింది.
90 అడుగుల హనుమాన్ విగ్రహం
టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో అష్టలక్ష్మి గుడి ఉంది. ఈ గుడిలో 90 అడుగుల ఎత్తుతో కాంస్య హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' అని పేరు పెట్టారు. విగ్రహ భాగాలు చైనాలో తయారు చేసి, టెక్సాస్‌కు తీసుకొచ్చి అసెంబుల్ చేశారు. 2024 ఆగస్టులో చిన్న జ్యోతి స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమెరికాలోని అతి పెద్ద విగ్రహాల్లో నాలుగవదిగా ఇది నిలుస్తోంది.
