బయటపడ్డ బుష్‌తో సంభాషణలు

Putin Concerned Over Pakistan’s Nuclear Expansion: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో పాకిస్తాన్ అణ్వాయుధాల కార్యక్రమం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌తో జరిగిన సంభాషణల్లో పాకిస్తాన్‌ను 'అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి'గా పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు బహిర్గతమైంది.

2001 నుంచి 2008 వరకు పుతిన్-బుష్ మధ్య జరిగిన సమావేశాలు, ఫోన్ సంభాషణల ట్రాన్‌స్క్రిప్ట్‌లను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ ఇటీవల విడుదల చేసింది. అందులో పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ఇరువురు నేతలు ప్రమాదకరమైనదిగా, నాన్-ప్రొలిఫరేషన్‌కు ముప్పుగా భావించినట్టు స్పష్టమవుతోంది.

స్లోవేనియాలో 2001లో జరిగిన తొలి సమావేశంలోనే పుతిన్ ఈ ఆందోళనను బుష్ ముందు బయటపెట్టారు. "పాకిస్తాన్ గురించి నాకు ఆందోళన కలిగిస్తోంది. అది అణ్వాయుధాలు కలిగిన సైనిక పాలన మాత్రమే, ప్రజాస్వామ్యం కాదు. అయినా పశ్చిమ దేశాలు దాన్ని ఎందుకు విమర్శించడం లేదు?" అని ప్రశ్నించారు. అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలకు అణు సాంకేతికత బదిలీ అవుతుందన్న ఆందోళనలు కూడా ఈ సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చాయి.

ఈ డాక్యుమెంట్లు రష్యా-అమెరికా మధ్య అణు నియంత్రణ సహకారాన్ని హైలైట్ చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ అణు ఆయుధాల భద్రత, విస్తరణపై ఇరువురి ఆందోళనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story