అమెరికా ఆంక్షలను ఖండించిన పుతిన్

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ మరియు చైనాకు మద్దతు పలికారు. ఈ రెండు దేశాలపై అమెరికా విధిస్తున్న ట్రేడ్ టారిఫ్ఫులను ఆయన ఆగ్రహంగా ఖండించారు. ఇవి కాలం చెల్లిన వలసవాద మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు. చైనాలో నాలుగు రోజుల పర్యటన ముగించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

1.5 బిలియన్ల జనాభా గల భారత దేశం మరియు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా వంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే ఆంక్షలు సమంజసం కాదని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ఆ దేశాల సార్వభౌమత్వంపై దాడులుగా భావించే అవకాశం ఉందని హెచ్చరించారు. వలస రాజ్యాల కాలం ముగిసిపోయిందని పేర్కొన్న ఆయన, భాగస్వామ్య దేశాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రంప్‌కు సలహా ఇచ్చారు.


ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, చివరకు సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రమే కారణంగా చూపించి టారిఫ్‌లు విధించే ట్రంప్ చర్యలను పుతిన్ విమర్శించారు. ఉదాహరణకు, ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేని బ్రెజిల్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించడం దీనికి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story