Rising Tensions Between the United States and Iran: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు: ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు యుఎస్ సన్నాహాలు?
ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు యుఎస్ సన్నాహాలు?

Rising Tensions Between the United States and Iran: అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పంద చర్చలు ప్రతిష్టంభనకు చేరిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఇరాన్‌పై అమెరికా త్వరలోనే పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం ఇజ్రాయెల్ ఇరాన్‌పై 12 రోజుల పాటు నిర్వహించిన యుద్ధం కంటే మరింత భారీ స్థాయిలో ఈ సైనిక ఆపరేషన్ ఉండవచ్చని ఆక్సియోస్ నివేదిక అంచనా వేస్తోంది.
"ట్రంప్ అసహనానికి గురవుతున్నారు. యుద్ధం వద్దని ఆయన చుట్టూ ఉన్న కొంతమంది సలహా ఇస్తున్నారు. అయినప్పటికీ, మరికొన్ని వారాల్లోనే భారీ స్థాయి సైనిక చర్య జరిగే అవకాశాలు 90 శాతం ఉన్నాయి" అని అమెరికా అధ్యక్షుడి సలహాదారుడు చెప్పినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ట్రంప్ సలహాదారులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లు జెనీవాలో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. అయితే, చర్చల్లో చర్చించిన అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి ఇరాన్‌కు రెండు వారాల గడువు ఉండగా, అదే సమయంలో వైట్‌హౌస్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా అంచనాలు సూచిస్తున్నాయి.

