Russia: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: 24 గంటల్లో వెయ్యి డ్రోన్లతో అతిపెద్ద వైమానిక దాడి
24 గంటల్లో వెయ్యి డ్రోన్లతో అతిపెద్ద వైమానిక దాడి

Russia: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి అతి తీవ్రమైన దాడికి దిగింది. గత 24 గంటల్లో ఏకంగా వేయి డ్రోన్లను ప్రయోగించి దేశవ్యాప్తంగా భారీ వైమానిక దాడులు చేపట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో గగనతల దాడి ఇదే మొదటిసారి.పట్టపగలే ఉక్రెయిన్‌లోని 550కి పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ దళాలు 541 డ్రోన్లను కూల్చేశాయని, అయినప్పటికీ పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు కూడా జరిగాయని తెలిపారు.ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని ప్రసూతి ఆసుపత్రి సమీపంలో జరిగిన దాడిలో ఒక సైనికుడు, అతని కుమార్తె ప్రాణాలు కోల్పోయారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే కుమారుడికి జన్మనిచ్చిన తన భార్యను చూసేందుకు ఆసుపత్రి వార్డుకు వెళ్తుండగా ఈ దాడి జరిగి వారు మరణించారని వివరించారు.దాడుల వల్ల వందల సంఖ్యలో నివాస భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయని, నష్టాల తీవ్రతను ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉందని అధ్యక్షుడు తెలిపారు. రష్యా దాడులను తీవ్రతరం చేస్తున్న తీరు చూస్తుంటే యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు లేదని స్పష్టమవుతోందన్నారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు.

