Russian and Israeli Forces Added to UN Blacklist: సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడినందుకు ఐక్యరాజ్యసమితి (UN) వార్షిక నివేదికలో రష్యా, ఇజ్రాయెల్ దళాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వివాదాస్పదంగా మారింది. ఈ నివేదికపై రెండు దేశాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఐరాస నివేదికలో ఇజ్రాయెల్ దళాలను తొలిసారి చేర్చారు. పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు లైంగిక హింసకు పాల్పడుతున్నాయన్న ఆరోపణల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు.

రష్యా, ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకత:

ఈ నివేదికపై ఐరాసలోని రష్యా రాయబారి వెసెల్లీ నెబెంజియా తీవ్రంగా స్పందించారు. తమ దేశాన్ని తప్పుడు ఆరోపణలతో విలన్‌గా చిత్రీకరించడం జరిగిందని మండిపడ్డారు.

ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ మాట్లాడుతూ, “మా సైన్యాన్ని ISIS, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సమానంగా చూపించడం ఎంతో బాధాకరం. ఐరాస సెక్రటరీ జనరల్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు” అని తీవ్రంగా విమర్శించారు.

ఈ ఏడాది డిసెంబర్‌తో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ముగుస్తుంది.

Next Story