✕
Tensions in PoK: పీవోకేలో ఉద్రిక్తతలు: జేఏఏసీ పిలుపుతో వేలాది మంది ముజఫరాబాద్ లాంగ్ మార్చ్
By PolitEnt MediaPublished on
ముజఫరాబాద్ లాంగ్ మార్చ్

x
Tensions in PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ ప్రభుత్వం నిరంకుశ వ్యవహారాలకు వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమం ముదురుతోంది. 'ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (జేఏఏసీ) తన డిమాండ్ల (చార్టర్ ఆఫ్ డిమాండ్స్)ను నెరవేర్చాలని ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. దీంతో రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు వేలాది మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ చేపట్టారు.
పీవోకేలో పాక్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్థానిక నేతల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని జేఏఏసీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ద్రవ్యోల్బణం తట్టుకోవడానికి నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది.
Next Story

