The growing distance between Trump and Musk

అమెరికాలో అపూర్వ సోదరులుగా పేరొందిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ స్నేహంలో చీలికలు కనిపిస్తున్నాయి. రిపబ్లికన్ టాక్స్ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో, వారి స్నేహంలో చీలికలు వస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టాక్స్ బిల్లుపై మస్క్‌ రియాక్షన్‌పై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయగా, ఎలాన్ మస్క్ స్పందిస్తూ, తాను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచేవారే కాదని కౌంటర్‌ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఎలాన్ మస్క్ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఇలా రాసుకొచ్చారు, "నేను లేకుండా ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారు, డెమోక్రటిక్ పార్టీ వాళ్లు హౌస్‌ను నియంత్రించేవాళ్లు. రిపబ్లికన్లు సెనేట్‌లో 51-49గా ఉండేవారు." అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. దీనికి ముందు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, రిపబ్లికన్ టాక్స్ బిల్లును ఎలాన్ మస్క్‌ వ్యతిరేకించినందుకు తాను చాలా నిరాశకు గురయ్యానని అన్నారు. ఎలాన్ మస్క్‌కు వైట్ హౌస్ గుర్తుకు వస్తుందని, అతను ట్రంప్ డిరేంజ్‌మెంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడని అన్నారు. న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్‌ ప్రకారం, "నేను ఎలాన్‌ వైఖరి పట్ల చాలా నిరాశకు గురయ్యాను. నేను ఎలాన్‌కు చాలా సహాయం చేశాను." అని డోనాల్డ్‌ ట్రంప్‌అన్నారు.

మరోవైపు.. బిల్లుకు సంబంధించి మస్క్ చేసిన బహిరంగ విమర్శలపై వైట్ హౌస్ స్పందిస్తూ, అధ్యక్షుడు తన అభిప్రాయాన్ని మార్చుకోబోరని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, "ఎలాన్ మస్క్ ఈ బిల్లుపై ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో అధ్యక్షుడికి ఇప్పటికే తెలుసు. ఇది అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చదు. ఇది గొప్ప అద్భుతమైన బిల్లు, ఆయన దానికి కట్టుబడి ఉన్నారు" అని స్పష్టం చేశారు. అయితే, ఎక్స్ వేదికగా దీనిపై పెద్ద సుదీర్ఘమైన డిబేట్ రన్ చేస్తున్నారు ఎలాన్ మస్క్. పనిలో పనిగా అమెరికాలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అది న్యూ బ్లడ్‌తో నిండి ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ పెట్టే అంశంపై స్పందన కోరేందుకు ఓ పోల్‌ను కూడా రన్ చేస్తున్నారు.


Politent News Web4

Politent News Web4

Next Story