భారత్‌ తీవ్ర స్పందన

Trump Claims He Promised Support to India: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత్ తనకు హామీ ఇచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై భారత్ తాజాగా తీవ్రంగా స్పందించింది. ఇంధన ఎంపికల్లో భారత వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు.

చమురు, గ్యాస్ దిగుమతుల్లో భారత్ ప్రముఖ దేశమని, ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో వినియోగదారుల ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మా దిగుమతి విధానాలు ఈ లక్ష్యంతోనే రూపొందాయని, స్థిరమైన ఇంధన ధరలు, సురక్షిత సరఫరాలు మన ప్రధాన లక్ష్యాలని వివరించారు. అంతర్జాతీయ ఇంధన ధరల స్థిరత్వం, సరఫరా గొలుసుల విస్తరణకు మేం ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి చమురు కొనుగోళ్లపై కూడా మాట్లాడారు. భారత్ తన ఇంధన దిగుమతులను విస్తరించడానికి ప్రయత్నిస్తోందని, గత దశాబ్దంలో గణనీయ పురోగతి సాధించామని, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే, రష్యా చమురు కొనుగోళ్లు, మోదీ హామీపై భారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

భారత ఆర్థిక వ్యవస్థకు మా చమురు కీలకం: రష్యా

ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా కూడా ప్రతిస్పందించింది. తమ చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది నమ్మకం ఆధారంగా ఉందని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాల్లో తమకు ఎలాంటి జోక్యం లేదని, భారత్‌తో దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ప్రకటించారు. ఇంధన విధానంపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నప్పటికీ, భారత్ తమకు సన్నిహిత భాగస్వామని ట్రంప్ చెప్పారు. మోదీ తన మంచి స్నేహితుడని, వారి మధ్య గొప్ప బంధం ఉందని వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story