ఖమేనీ హెచ్చరికపై స్పందన

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరికలపై స్పందించారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం జరిగే అవకాశం ఉందని, దాడికి పాల్పడేవారికి గట్టి సమాధానం చెబుతామని ఖమేనీ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా యుద్ధనౌకలను రంగంలోకి దించిన నేపథ్యంలో ఖమేనీ ఇంత సూటిగా హెచ్చరించడం ఇదే మొదటిసారి.

ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు ఇరాన్ సమీపంలో ఉన్నాయి. రెండు రోజుల్లో ఒప్పందం (డీల్) కుదిరే అవకాశం ఉందని ఆశిస్తున్నా. ఒకవేళ ఒప్పందం జరగకపోతే.. ఖమేనీ చెప్పినది నిజమవుతుందో లేదో త్వరలోనే తెలుస్తుంది’’ అంటూ హెచ్చరించారు.

ఇరు దేశాల నాయకుల ఈ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రమైంది. ఏక్షణంలో పరిస్థితి ఏ రూపం తీసుకుంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story