‘బీబీ.. నీకు మార్గం లేదు’

Trump Pressures: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నోబెల్‌ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును ఒత్తిడి చేసి, హమాస్‌ను భయపెట్టి గాజా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ బిజీగా ఉండగా, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక రహస్య నోట్‌ ఇచ్చి, శాంతి ఒప్పందం సిద్ధమైందని తెలిపారు. దీంతో ట్రంప్‌ సంతోషంగా ‘దేవుడి ఆశీస్సులతో శాంతిని తెచ్చాను’ అంటూ పోస్ట్‌ చేశారు.

నెతన్యాహుకు కఠిన హెచ్చరికలు..

ఇజ్రాయెల్‌ అమెరికాకు మిత్ర దేశమే అయినా, ఒప్పందం విషయంలో ట్రంప్‌ కఠినంగా వ్యవహరించారు. సెప్టెంబరు 29న వైట్‌హౌస్‌లో నెతన్యాహుతో సమావేశమై, తన 20 పాయింట్ల శాంతి ప్రణాళికను వివరించారు. బహిరంగంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించినా, రహస్యంగా ఒప్పందం చేసుకోవాల్సిందేనని హెచ్చరించారు. అరబ్‌ దేశాల నేతలతో చర్చలు జరిపి తయారుచేసిన ముసాయిదాను అందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తించడానికి నెతన్యాహు విముఖత చూపడంతో, ట్రంప్‌ మరింత ఒత్తిడి పెంచారు. ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో, నెతన్యాహును ఖతార్‌ నేతకు క్షమాపణలు చెప్పేలా చేశారు. ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోను కూడా విడుదల చేశారు. ‘ఇది నీ విజయం, నాతో ఉంటే బాగుంటావు’ అంటూ నెతన్యాహును హెచ్చరించారు.

హమాస్‌కు గడువు పెట్టి భయపెట్టి..

హమాస్‌తో కూడా ట్రంప్‌ కఠినంగా వ్యవహరించారు. అక్టోబరు 5లోగా ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో హమాస్‌ వెనక్కి తగ్గి, బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఆ తర్వాత గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.

రహస్య నోట్‌ తర్వాత ప్రకటన..

సమావేశంలో రూబియో ఇచ్చిన నోట్‌లో ‘డీల్‌ సిద్ధమైంది, పోస్ట్‌ చేయాలా?’ అని ఉంది. దీంతో ట్రంప్‌ మధ్యప్రాచ్య శాంతి ఒప్పందం దగ్గర్లో ఉందని ప్రకటించారు. రెండు గంటల్లోనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

నోబెల్‌ శాంతి బహుమతి రానుందా?

ఈ ఒప్పందంతో ట్రంప్‌ను ‘శాంతి అధ్యక్షుడు’ అంటూ వైట్‌హౌస్‌ ప్రశంసించింది. అక్టోబరు 10న నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటన ఉండటంతో, ట్రంప్‌కు ఇది మరింత అనుకూలంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story