చైనా సుంకాలు తగ్గించే సూచన: ట్రంప్

Trump Suggests China Should Reduce Tariffs: చైనాపై ఇటీవల 100 శాతం సుంకాలు విధించి సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ సుంకాలు శాశ్వతమైనవి కావని, చైనా ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయని ఆయన సూచించారు. చైనా చర్యల వల్లే ఈ సుంకాలు విధించాల్సి వచ్చిందని, అయితే అవి ఎప్పటికీ అలాగే కొనసాగవని ట్రంప్ స్పష్టం చేశారు.

ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, "ఈ సుంకాలు శాశ్వతమైనవి కావు. రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం జరగనుంది. అప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సుంకాల విషయంలో స్పష్టత వస్తుంది. చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశిస్తున్నా" అని అన్నారు. చైనా ఎప్పుడూ అమెరికాపై ఆధిపత్యం చూపాలని చూస్తుందని, భవిష్యత్ ఏమిటో తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇటీవల చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులను తగ్గించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోనే 100 శాతం సుంకాలు విధించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా ప్రపంచ దేశాలను కట్టడి చేయాలని చూస్తోందని విమర్శించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story