Trump Warns: అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ, “ఇరాన్ నన్ను చంపాలని ప్రయత్నిస్తే.. 1000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాం. వెంటనే వేలాది క్షిపణుల వర్షం కురిపిస్తాం. ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి మా సైన్యం సిద్ధంగా ఉంది” అని వెల్లడించారు.

ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ నన్ను చంపడంలో సఫలమైతే ఏం చేయాలో ఇప్పటికే సూచనలు ఇచ్చాను. అంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్‌పై బాంబులు కురిపించాలని ఆదేశాలు ఇచ్చాను” అని పేర్కొన్నారు. అయితే టెహ్రాన్ తనను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇటీవల హర్మూజ్ సముద్రంలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, దానికి ప్రతిస్పందనగా అమెరికా క్షిపణి దాడులు చేయడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఒప్పందం కుదిరినా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ వైపు నుంచి కూడా అమెరికా ఒప్పందం ఉల్లంఘిస్తే తమ దేశం రక్షణ కోసం సిద్ధంగా ఉంటుందని పార్లమెంటరీ స్పీకర్ ఘాలిబఫ్ హెచ్చరించారు.

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story