US Court : మెటాపై అమెరికా కోర్టు భారీ జరిమానా.. యువత మానసిక ఆరోగ్యానికి నష్టం చేసినందుకు రూ.8,967 కోట్లు
నష్టం చేసినందుకు రూ.8,967 కోట్లు

US Court : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటా సామాజిక మాధ్యమాల వల్ల పిల్లలు, యువతకు మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నందుకు అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు భారీ జరిమానా విధించింది. గురువారం రాత్రి జడ్జి బ్రాయన్ బీడ్ షీడ్ మెటాకు 56.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.5,400 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు.
ఈ మొత్తంలో 42 కోట్ల డాలర్లు (రూ.3,997 కోట్లు) యువతకు చికిత్స సేవల కోసం కేటాయించాలని, మిగతా నిధులను అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలు, స్క్రీనింగ్ సేవలు, రాబోయే ఐదేళ్లలో ఇతర ఖర్చులకు ఉపయోగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది మొదటి దశ విచారణలో విధించిన 37.5 కోట్ల డాలర్ల (రూ.3,569 కోట్లు) జరిమానాకు అదనం. దీంతో మెటాపై మొత్తం 94.2 కోట్ల డాలర్లు (రూ.8,967 కోట్లు) జరిమానా విధించినట్లయింది.
మెటా సామాజిక మాధ్యమ వేదికలు యువ వినియోగదారులకు తీవ్రమైన, తీరని మానసిక నష్టం కలిగించాయని న్యూమెక్సికో కోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆదేశం యువత మానసిక ఆరోగ్య పరిరక్షణలో మెటా బాధ్యతలను గుర్తుచేస్తూ, నష్టపరిహారం, చికిత్స సేవలకు ప్రాధాన్యం ఇచ్చింది.

