సైన్యాన్ని మొహరిస్తున్న అమెరికా

Targeting Venezuela: లాటిన్‌ అమెరికాలో మళ్లీ గుబులు పుట్టింది.. డ్రగ్‌ కార్టెల్స్‌పై యుద్ధం పేరుతో వెనెజువెలా సమీపంలోని కరీబియన్‌ జలాల్లో అమెరికా యుద్ధ నౌకలు, సైనికులను భారీగా మోహరిస్తోంది. వేల మంది సైన్యం మోహరణ అనుమానాలకు తావిస్తోంది. వెనెజువెలాపై దాడి అవకాశం లేదని పరిశీలకులు చెప్పినప్పటికీ, ఇటీవల డ్రగ్‌ కార్టెల్‌ నౌకపై అమెరికా దాడి ఉద్రిక్తతలకు కారణమైంది.

చమురే లక్ష్యం

వెనెజువెలా చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్నది అమెరికా లక్ష్యం. హ్యూగో చావెజ్‌ హయాంలో నుంచి ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ దిశగా పావులు కదిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధినేత మడురోను పదవీచ్యుతుడిని చేయాలని లేదా అడ్డు తొలగించుకోవాలని అమెరికా భావిస్తోంది. లాటిన్‌ అమెరికా నుంచి డ్రగ్స్‌ సరఫరాతో అమెరికా యువత జీవితాలు నాశనమవుతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. మడురో డ్రగ్‌ సరఫరా వెనుక ఉన్నాడని విమర్శించారు. ఆయన జాడ తెలిపితే రూ.430 కోట్లు ఇస్తామని శ్వేతసౌధం ప్రకటించింది.

కరీబియన్‌లో ఉద్రిక్తత

తాజాగా వెనెజువెలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరీబియన్‌ సముద్రంలో అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా మడురో అమెరికా యుద్ధ నౌకలకు దగ్గరగా తన యుద్ధ విమానాలను ఎగురవేశారు. దీంతో ట్రంప్‌ 8 యుద్ధ నౌకలను, 4,500 మంది సైనికులతో కరీబియన్‌ సముద్రంలోకి పంపారు. శుక్రవారం రాత్రి 10 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు, పీ-8 నిఘా విమానాలను ప్యూర్టోరికోలో మోహరించారు.

వెనెజువెలా సైనిక బలం

అమెరికాతో పోలిస్తే వెనెజువెలా చిన్న దేశం. 3.15 కోట్ల జనాభా, 1.23 లక్షల సైన్యం, 229 యుద్ధ విమానాలు, 30 ఫైటర్‌ జెట్లు ఉన్నాయి. అమెరికా వద్ద 13,000 విమానాలు ఉన్నాయి. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ, భౌగోళిక దూరం కారణంగా అవి ఎంతవరకు సహాయం చేస్తాయో అనిశ్చితి.

చమురు నిల్వలు

వెనెజువెలా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం. 2021 నాటికి 48వేల మిలియన్‌ టన్నుల చమురు నిల్వలు గుర్తించారు, ఇది సౌదీ నిల్వల కంటే అధికం. అయితే, అమెరికా, ఐరోపా ఆంక్షలతో ఆదాయం తగ్గి, ఆర్థిక మాంద్యం ఎదుర్కొంది. ట్రంప్‌ గతంలో వెనెజువెలా చమురును స్వాధీనం చేసుకోవాలని, మడురో సర్కారును కూల్చాలని ప్రయత్నించారు. 2023లో ఓ సభలో ఈ కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు

PolitEnt Media

PolitEnt Media

Next Story