U.S. Drops ‘Indo’ from Command Name: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటి చెప్పిన అమెరికా, ఇప్పుడు భారత్‌కు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తీసివేసి, ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మార్చింది. అంతేకాదు, భారత చిత్రపటంలో కూడా మార్పులు చేసి చూపించడం వివాదాస్పదమైంది. జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనున్న వేళ ఈ పరిణామం గమనార్హం.

అమెరికా రక్షణ శాఖ వెల్లడిన ప్రకారం, చారిత్రక ‘యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్’ (US Indo-Pacific Command) పేరును మళ్లీ ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మార్చారు. ‘‘చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ నిర్ణయం’’ అని రక్షణ శాఖ తెలిపింది. ఈ కమాండ్ పరిధిని తెలిపే వెబ్‌సైట్ ఫొటోలో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం మరింత వివాదానికి దారితీసింది.

చారిత్రక నేపథ్యం:

యూఎస్ పసిఫిక్ కమాండ్‌ను 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఏర్పాటు చేశారు. అగ్రరాజ్య వెస్ట్ కోస్ట్ నుంచి భారత పశ్చిమ తీరం వరకు గత ఏడు దశాబ్దాలుగా ఈ కమాండ్ సేవలందిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో కీలక పాత్ర పోషించింది. కొరియన్, వియత్నాం యుద్ధాల్లో పాల్గొన్నాయి. అనేక మానవతా ఆపరేషన్లు నిర్వహించింది.

2018లో ట్రంప్ మొదటి పాలనలో హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య అనుసంధానతను గుర్తించి ‘ఇండో’ అనే పదం చేర్చి ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా మార్చారు. ఇప్పుడు ఎనిమిది ఏళ్ల తర్వాత యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్‌ను అమెరికా దూరం పెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామం భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story