US-Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాజా అంశాలపై చర్చించేందుకు ఇరాన్ తమను సంప్రదించిందని, దాని మేరకు ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం సమావేశం జరగనుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. తుది ఒప్పందం కోసం చర్చలు జరగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

అయితే ఇరాన్ వైపు నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ఖతార్‌లో ఈ వారం ఇరాన్-అమెరికా బృందాల మధ్య సమావేశాలు నిర్వహించే ప్రణాళిక లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిబబాడి స్పష్టం చేశారు. తమ హామీల అమలు, అమెరికా చర్యల పర్యవేక్షణ, ఖతార్‌తో సంప్రదింపులు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పారు. దోహాలో మంగళవారం చర్చలు జరుగుతాయన్న వార్తలను ధృవీకరించడం లేదని, పరిస్థితులు సాధారణమైన తర్వాతే చర్చలు సాగతాయని అన్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఎలా ముందుకు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story