అమెరికాకు పోలండ్‌ గట్టి షాక్..!

“మాకు ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం లేదు” – ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ ఘాటు స్పందన


US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన పోలండ్‌.. దీనిపై అమెరికా రాయబారి ఇచ్చిన హెచ్చరికలకు బదులుగా గట్టి షాకిచ్చింది. “మాకు లెక్చర్లు చెప్పే ప్రయత్నం చేయవద్దు” అంటూ పోలండ్ ప్రధాని తీవ్రంగా స్పందించారు.

మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన కృషి గుర్తింపుగా 2027 నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును నామినేట్ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ నుంచి పోలండ్ పార్లమెంటుకు అభ్యర్థనలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనను పోలండ్ పార్లమెంట్ స్పీకర్ తీవ్రంగా తిరస్కరించారు. “బలవంతపు రాజకీయాలు, విధానాలతో అంతర్జాతీయ సంస్థలను అస్థిరపరిచిన ట్రంప్‌ నోబెల్‌కు అర్హులు కాదు. ఈ ప్రతిపాదనను మేం అంగీకరించలేం” అని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. పోలండ్‌లోని అమెరికా రాయబారి టామ్ రోజ్ మాట్లాడుతూ.. “ఇది ట్రంప్‌పై అవమానకరమైన చర్య. ఇలాంటి నిర్ణయాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి” అని హెచ్చరించారు. కొందరు అధికారులు ట్రంప్‌ను పోలండ్‌లోకి రానివ్వకుండా బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని సూచనలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై పోలండ్ ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మిత్రదేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. మాకు ఉపదేశాలు, లెక్చర్లు ఇచ్చే అవసరం లేదు. దౌత్య సంబంధాలు ఎలా నిర్వహించాలో మాకు బాగా తెలుసు” అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ వివాదంతో అమెరికా-పోలండ్ మధ్య గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలపై కొత్తగా ఒత్తిడి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story