nald Trump:ట్రంప్ సుంకాల బెదిరింపు .. ఈయూ దేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు
ఈయూ దేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో యూరోపియన్ దేశాలపై విధించబోయే సుంకాల (టారిఫ్‌లు) బెదిరింపును వెనక్కి తీసుకున్నారు. దావోస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.
US President Donald Trump: గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ ఆకాంక్షలకు మద్దతు ఇవ్వని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని గతంలో ఆయన బెదిరించారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ సుంకాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన సమావేశం చాలా ఫలప్రదంగా ఉందని, గ్రీన్‌లాండ్ మరియు ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తుపై ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించామని ట్రంప్ తెలిపారు. ఈ అవగాహన ఆధారంగా సుంకాలను విధించడం లేదని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో మిత్రదేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రీన్‌లాండ్‌లో ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణంపై చర్చలు కొనసాగుతున్నాయని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు ఈ విషయంలో చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు.
ఈ నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్సే లోకే రాస్ముసెన్ స్వాగతించారు. ఇది చాలా సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో ట్రంప్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో బలప్రయోగం చేయబోమని దావోస్ వేదికగా చెప్పిన ఆయన.. తాజాగా సుంకాల బెదిరింపుపై వెనక్కి తగ్గారు.

