U.S: అమెరికా విదేశాంగ శాఖ బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటకం) వీసాల కోసం శాశ్వత వీసా బాండ్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. వీసా ఓవర్‌స్టే రేటు ఎక్కువగా ఉన్న 50 దేశాల పౌరులు ఇకపై ఈ వీసాలు పొందాలంటే గరిష్ఠంగా 20 వేల డాలర్ల బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఆగస్టు 3, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

మొదట పైలట్‌ ప్రోగ్రామ్‌గా ప్రారంభమైన ఈ పథకాన్ని ఇప్పుడు శాశ్వతంగా మార్చారు. పైలట్‌ దశలో బాండ్‌ మొత్తం 5 వేలు, 10 వేలు, గరిష్ఠంగా 15 వేల డాలర్లుగా ఉండగా, తుది నిబంధనల్లో 5 వేల డాలర్ల ఆప్షన్‌ను తొలగించి గరిష్ఠ మొత్తాన్ని 20 వేల డాలర్లకు పెంచారు. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. భారత్‌ పేరు లేకపోవడం ఆశాజనకం. బాండ్‌ పరిధిలోకి వచ్చే ప్రయాణికులు కేవలం వాణిజ్య విమానాల్లోనే అమెరికాకు రాకపోకలు సాగించాలి. వీసా తిరస్కరణ జరిగినా లేదా నిర్దేశిత గడువులోగా తిరిగి వెళ్లినా బాండ్‌ మొత్తం తిరిగి ఇస్తారు. గడువు దాటి అక్కడే ఉంటే ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story