US President Donald Trump: ఇరాన్ పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్
సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్

US President Donald Trump: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యలు పరిశీలనలో ఉన్నాయని, ఆ దేశంలోని పాలనలో మార్పు జరిగితేనే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మాట్లాడుతూ, “ఇరాన్‌లో పాలన మార్పు జరిగితే అది ఉత్తమ పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఆ మార్పు జరిగే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. గత 47 ఏళ్లుగా చర్చల పేరుతో ఇరాన్ నాయకులు మాటలు మాత్రమే మాట్లాడుతున్నారని, ఈలోగా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆలస్యం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.
అమెరికా సైన్యం ఇప్పటికే ఇరాన్‌ను చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, కొత్త పాలకులను ఇరాన్ ప్రజలే ఎన్నుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పడానికి ఇది అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు

