nimisha Priya : నిమిషప్రియ క్షమా ధనం మాకొద్దు…
నేరస్తులకు శిక్ష పడాల్సిందే అంటున్న బాధిత కుటుంబం

- యెమన్ లో నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత్ సంప్రదింపులు
- బాధిత కుటుంబంతో సంప్రదింపులకు రంగంలోకి దిగిన మత గురువులు
యెమన్ దేశంలో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష పెట్టడానికి హతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం ఎట్టి పరిస్ధితుల్లో అంగీకరించడం లేదు. నిమిషకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందే అని మెహది కుటంబం పట్టుబడుతోంది. వాస్తవానికి నేడు బుధవారం అమలు కావాల్సిన నిమిష మరణశిక్ష భారత మత పెద్దల జోక్యంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇదే సమయంలో హతుడు మెహదీ కుటుంబ సభ్యులకు బ్లడ్ మీన ఇవ్వడం ద్వారా వారి అంగీకారంతో నిమిషకు క్షమా భిక్ష పొందాలని ఆమె కుటుంబ సభ్యులతో పాటు భారత్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీరి ప్రయత్నాలను మెహదీ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. నేరానికి క్షమాపణ ఉండదని హతుడు మెహదీ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ ఖరాఖండీగా చెపుతున్నారు. నిమిషకు శిక్ష పడాల్సిందే అని తాము ఎటువంటి స్ధితిలోనూ బ్లడ్ మనీ అంగీకరించేది లేదని అబ్ధుల్ ఫత్తా తెగేసి చెపుతున్నారు. ఈ విషయంలో చాలా మంది మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నారని అయినా తమ అభిప్రాయాన్ని మార్చుకోమని మెహదీ సోదరుడు స్పష్ట చేశారు. నిమిష నిందితురాలని కానీ మీడియా ఆమెను బాధితురాలిగా చూపుతోందని అబ్దుల్ ఫత్తా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ కలుగ జేసుకుని సంప్రదింపులు చేస్తోంది. మరో పక్క మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కూడా మెహదీ కుటుంబాన్ని క్షమాధనం తీసుకునేలా ఒప్పంచడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మెహదీ కుటుంబం తాము నిమిషను క్షమించలేమని మాకు ఆ బ్లడ్ మనీ వద్దని చెప్పడంతో వీరి సంప్రదింపులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. నిమిష తల్లి యెమన్ లోనే ఉండి కుమర్తెను క్షమిస్తే ఒక మిలియన్ డాలర్ల క్షమా ధనం ఇస్తానని చెపుతున్నారు.
