అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు పై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సారి విరుచుకుపడ్డారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే తాను ఆమర్నాడే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. మొదటి నుంచి ఎలాన్‌ మస్క్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి ట్రంప్‌ తో విభేధాలు కొని తెచ్చుకున్నారు. సంక్షేమాన్ని తగ్గించడమే కాకుండా అమెరికన్లకు రుణ భారం పెంచే విధంగా ఉన్న ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే సభ్యులను పదవీచ్యుతులను చేస్తానని మస్క్‌ బెదిరింపులకు కూడా దిగారు. ఈ బిల్లు పరమ చెత్తబిల్లని అమెరికాపై రుణపరిమితిని ఐదు ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని చెపుతూ ఎలాన్‌ మస్క్‌ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ల బాగోగులు పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ అవసరం ఇప్పుడు వచ్చిందని ఎలన్‌ మస్క్‌ అంటున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని చట్టసభ సభ్యులు ప్రచారం చేశారని కానీ ఇప్పుడు రుణభారాన్ని పెంచే బిల్లుకు మద్దతు ఇస్తూ ఓటు వేస్తే వారందరూ సిగ్గుతో తలదించుకోవాలని మస్క్‌ విమర్శిస్తున్నారు. ఖర్చును పెంచే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ తరువాతి రోజే ది అమెరికా పార్టీ ఏర్పడుతుందని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. అమెరికలన్లుకు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలకు ప్రత్యామ్నంగా మరో పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని ఎలాన్‌ మస్క్‌ అంటున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story