Kamal Haasan to Rajya Sabha with DMK support

సినీ నటుడు కమలహాసన్ పెద్దల సభకు వెళ్లనున్నారు. రాజ్యసభకు తమ పార్టీ అభ్యర్థిగా కమల్ హాసన్ పేరును డిఎంకె ప్రతిపాదించింది. ఈరోజు పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. 2024లోకసభ ఎన్నికల సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి డీఎంకే అధినేత స్టాలిన్ కేటాయించారు.
వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిఎంకె స్థానిక పార్టీలను కూడదీసి బిజెపిని ఎదుర్కునేందుకు ఇప్పటి నుంచే సమయాత్తం అవుతోంది. ఇందులో భాగంగానే కమల్ హాసన్ పేరును పార్లమెంటుకు ప్రతిపాదించింది.
మరోవైపు థగ్ లైఫ్ సినిమా ఫంక్లన్లో కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. థగ్‌లైఫ్ ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో... ‘నా జీవితం, నా కుటుంబం తమిళ భాష’ అని పేర్కొన్నారు. ‘నటుడు శివరాజ్‌కుమార్ మరో రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించన్నారు.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందనే కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడుతున్నారు. కన్నడ భాషను అవమానించారంటూ బెంగళూరులో థగ్ లైఫ్ సినిమా పోస్టర్లు, బ్యానర్లను చించేశారు.
