సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న భద్రతా దళాలు

జమ్మూకాశ్మీర్‌ పహల్గామ్‌ పర్యాటక ప్రదేశంలో గత ఏప్రిల్‌ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన తరువాత భారత భద్రతా దళాలు కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులను వేటాడి హతమరుస్తున్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ బలగాల జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భారత్‌ భద్రతా దళాలు, విదేశీ, స్వదేశీ అనే తేడా లేకుండా ఉగ్రవాదులపై విరుచుకు పడుతున్నారు. పహల్గామ్‌ దాడి జరిగిన తరువాత వేరు వేరుగా జరిగిన ఆరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 12 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు కాగా 9 మంది స్థానిక కాశ్మీర్‌కి చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. సాంబా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఏడుగురిని బీఆర్‌ఎస్‌ దళాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారంతా పాకిస్తాన్‌ జాతీయులే. దీని తరువాత షొషియన్‌ కెల్లార్‌ అటవీ ప్రాంతంలో ముగ్గురు కీలక లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు షాహిద్ కుట్టే. షాహిద్‌ షోపియన్‌లోని చోటిపోరా హీర్‌పోరా నివాసి. మార్చి 8, 2023న ఎల్‌ఇటిలో చేరిన కేటగిరీ-ఎ ఉగ్రవాది. ఇద్దరు జర్మన్ పర్యాటకులు, స్థానిక డ్రైవర్‌ను గాయపరిచిన షోపియన్‌లోని 2024 రిసార్ట్ కాల్పుల కేసులో కుట్టే నిందితుడు. 2024లో హెరాపోరాలో బిజెపి సర్పంచ్ హత్య. ఈ ఫిబ్రవరిలో కుల్గాంలో టెరిటోరియల్ ఆర్మీ జవాను హత్యలో కూడా అతను నిందితుడు. మరొకరు అద్నాన్ షఫీ దార్. ఇతను షోపియన్‌లోని వందునా మెల్హోరా నివాసి. అక్టోబర్ 18, 2024న ఎల్‌ఇటిలో చేరాడు. కేటగిరీ-సి ఉగ్రవాది. వలస కార్మికుడి హత్యకు అతను బాధ్యత వహించాడు. ఇక మూడొవ ఉగ్రవాది అమీర్ బషీర్. షోపియన్ ప్రాంత వాసి. లష్కరేతోయిబా విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యుడు. కేటగిరీ-C ఉగ్రవాది. పహల్గామ్ దాడికి టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించింది. దీని తరువాత త్రాల్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ మాడ్యుల్ కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఆసిఫ్ అహ్మద్ షేక్ ఒకరు. అవంతిపోరా జిల్లా కమాండర్. కేటగిరీ-C. ఏప్రిల్ 18, 2022 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. రెండో ఉగ్రవాది అమీర్ నజీర్ వాని. ఇతపు ఏప్రిల్ 26, 2024 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. కేటగిరీ-C ఉగ్రవాది. మూడొవ ఉగ్రవాది యావర్ అహ్మద్ భట్. యావర్‌ ఆగస్టు 26, 2024 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. ఇతను కూడా కేటగిరీ-C ఉగ్రవాది. ఇక ఆపరేషన్‌ మహదేవ్‌ పేరుతో చేసిన ఎన్‌కౌంటర్‌లో ముల్నార్‌ గ్రామంలో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. ఈఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులు సులేమాన్‌, ఆఫ్ఘన్‌, జిబ్రాన్‌లు పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాల్గొన్న వ్యక్తులని అధికారులు ధృవీకరించారు. ఆపరేషన్‌ శివశక్తి పేరుతో పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను భారత భద్రాతా దళాలు మట్టుపెట్టాయి. ఇక తాజాగా రెండు రోజుల క్రితం ఆపరేషన్‌ అఖల్‌ పేరుతో జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబాకు చెందిన ఉగ్రవాదులు జాకీర్‌ అహ్మద్‌ గని, ఆదిల్‌ రెహమాన్‌డెంటు, హరిస్‌దార్‌ హతమయ్యారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story