నేడు పార్లమెంటులో కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న ఎన్‌డీఏ ప్రభుత్వం

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో సహా అధికారిక పదవులు ఎవరు అనుభవిస్తున్న ఇకపై వారిలో ఎవరు 30 రోజులు కస్టడీలో ఉంటే వారి పదవి తక్షణం కోల్పోయేలా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లు కనుక పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందితే ఇకపై అధికారిక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎదైనా నేరం కింద అరెస్టై వారికి 30 రోజుల పాటు బెయిల్ రాకపోతే, 31వ రోజున ఆటోమేటిక్‌గా పదవి కోల్పోతారు. ఐదు సంవత్సరాల అంతకు మించిన సంవత్సరాలకు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అయ్యి, ౩౦ రోజుల్లో వారికి బెయిల్ రాకపోతే ఈ ప్రతిపాదిత చట్టం వర్తింస్తుంది. ఆవిధంగా ఈనూతన బిల్లులో ఎన్‌డీఏ సర్కార్‌ మార్గదర్శకాలు పొందుపరిచింది. హోంమంత్రి అమిత్ షా ఈ రోజు బుధవారం నాడు ఈ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. ఆమోదం పొందితే అవినీతి నాయకులు కుర్చీని కాపాడుకోవడం ఇక ముందు సాధ్యమయ్యే పనికాదు. ఇకపై చట్టం రాజకీయ నాయకుల చేతిలో ఆటవస్తువుగా ఉపయోగించుకోవడానికి వీలు పడకుండా ఉండే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఉపయోగించి ప్రత్యర్ధులను లొంగదీసుకుంటోందని భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నూతన బిల్లును కూడా దుర్వినియోగం చేసి ప్రత్యర్ధులపై ఉపయోగించే అవకాశం లేకపోలేదని విపక్షలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని ఎట్టి పరిస్ధితుల్లో ఈ బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇండియా కూటమి పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.

Politent News Web 1

Politent News Web 1

Next Story