స్కూలు భవనం పైకప్పు కూలి 4 విద్యార్థులు మృతి

శిధిలాల కింద చిక్కుకున్న మరో 40 మంది విద్యార్థులు

రాజస్తాన్‌ లోని ఓ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా శిధిలాల కింద మరో 40 మంది విద్యార్థులు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘోర ప్రమాదం రాజస్తాన్‌ రాష్ట్రంలోని ఝలవార్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఝలవార్‌ జిల్లాలోని మనోహర్‌ థానాలో పరిధిలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాఠశాల భవనంలోని ఒక తరగతి గది పైకప్పు కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలసి శిధిలాలను తొగించి లోపల చిక్కుకు పోయిన విద్యార్థులను వెలికి తీసే ప్రయత్నం మెదలు పెట్టారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థుల మృత దేహాలు బయటపడ్డాయి. శిధిలాల కింద మరో 40 మంది విద్యార్థులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story